కర్ణాటకలో మెగాస్టార్‌ క్రేజ్‌ చూశారా? బ్యాండ్‌ బాజాలతో ఫ్యాన్స్‌ రచ్చ, వీడియో వైరల్‌ (2024)

Waltair Veerayya: కర్ణాటకలో మెగాస్టార్‌ మాస్‌ క్రేజ్‌ చూశారా? బ్యాండ్‌ బాజాలతో ఫ్యాన్స్‌ రచ్చ

PublishedFri, Jan 13 2023 1:41 PM

కర్ణాటకలో మెగాస్టార్‌ క్రేజ్‌ చూశారా? బ్యాండ్‌ బాజాలతో ఫ్యాన్స్‌ రచ్చ, వీడియో వైరల్‌ (1)

మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో అయితే ఆయన పేరు ఓ బ్రాండ్‌గా నిలిచిపోయింది. అనీర్వచమైన తన నటనతో ఎన్నో రికార్డులు కొల్లగోట్టారు చిరు. ఇక ఆయన సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరం తలపిస్తుంది. ఇక పండక్కి ఆయన సినిమా అంటే ఇక ఫ్యాన్స్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలా థియేటర్లో సందడి చేసేందుకు ఈ సంక్రాంతికి(జనవరి 13న) వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.

చదవండి:Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ

ఆయన 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద మాస్ టాక్‌తో దూసుకెళ్తోంది.ఇదిలా ఉంటే చిరుకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే.దీంతో నేడు వాల్తేరు వీరయ్య రిలీజ్‌ సందర్భంగా కార్ణాటకలోని ఆయన అభిమానులు చేసిన హంగామా మామూలుగా లేదు. ఈ చిత్రంలోని చిరు 154 పోస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

చదవండి:శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

ఆయన 154 పోస్టర్లను 154 ఆటోలపై పెట్టి కర్ణాటక రోడ్లపై బ్యాండ్‌లుమోగిస్తూ.. డాన్స్‌ చేస్తూ జాతరగా భారీ ర్యాలీ నిర్వహించి చిరుపై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతూ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా.. మాస్‌ మహారాజా రవితేజ కీ రోల్‌ పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

Karnataka Mega Fans Huge Rally with 154 Autos. #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th #Bangalore #karnatka #MegaStarChiranjeevi pic.twitter.com/d89mn7x7Pq

— Pavanheartkiller (@Pavanheartkill1) January 12, 2023

# Tag

Waltair VeerayyaChiranjeeviKarnataka FansMovie Newsbangaluru

Related News by category

  • ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌- బీజాపూర్‌ సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ పోలీస్‌ సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ తెలిపారు. అయితే మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.వరస ఎన్‌కౌంటర్లు.. ఇటీవల ఛత్తీస్‌గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్‌కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు విడుస్తున్నారు. గత నెల ఏప్రిల్‌ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్‌కౌంటర్లలో103 మంది నక్సల్స్‌ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
  • ‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్‌ బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజ్వల్‌ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్‌ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
  • ‘దాడి సమయంలో కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారు’ ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.‘‘ మే 13న సీఎం ఆరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన పీఏ బిభవ్‌ కుమార్‌ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్‌ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్‌ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది. ఒక్కసారిగా బిభవ్‌ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్‌ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్‌ తెలిపారు.‘‘బిభవ్‌ కుమార్‌ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్‌ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్‌ కుమార్‌ ఫోన్‌ ఫార్మాట్‌, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్‌ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది.
  • స్టేజ్‌పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే! పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడీ, బంధువుల సందడి.. పవిత్రమైన వివాహ బంధం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాకుండా.. రెండు కుటుంబాలను దగ్గర చేసే వేడుక. అయితే కాలం మారుతున్న కొద్దీ పెళ్లి పద్దత్తుల్లోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య పెళ్లికి ముందే ఫోటో, వీడియో షూట్‌లు చేసుకోవడం ఎక్కువైపోయింది. పెళ్లిలో తాళి కట్టే సమయంలోనూ వరుడు, వధువు నుదుటిపై ముద్దు పెట్టిస్తున్నారు. ఇలా తమకు నచ్చిన విధంగా, జీవితాంతం గుర్తిండిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు.పాపం ఇలాగే ఆలోచించిన ఓ పెళ్లికొడుకు వేదిపైనే ఏకంగా వధువుకు ముద్దు పెట్టాడు. ఇంకేముంది వరుడి చర్య ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో హాపూర్‌లో చోటుచేసుకుంది. అశోక్‌ నగర్‌లో శనివారం ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిపించాడు. మొదటి పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా పాఫీగా జరిగింది. అయితే రెండో కూతురు పెళ్లి మాత్రం గందరగోళంగా మారింది. తాళి కట్టిన తరువాత ఇ‍ద్దరు దండలు మార్చుకుంటుండగా ఒక్కసారిగా వరుడు, వధువుకు ముద్దులు పెట్టాడు. ఎలాగో భార్యే కదా అని అనుకున్నాడో ఏమో బంధువుల సమక్షంలోనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇది చూసిన వేదికపై ఉన్న వధువు కుటుంబ సభ్యులు.. వరుడి బంధువులపై దాడి చేశారు. దీంతో వివాహ వేదిక రణరంగంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరడంతో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వరుడు వధువును వేదికపై బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా.. వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని వధువే పట్టుబట్టిందని వరుడు చెప్పాడు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి.
  • కెమికల్‌ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరిలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 దీంతో సమాచారం అదుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలాని​కి చేరుకొని 15 ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024
కర్ణాటకలో మెగాస్టార్‌ క్రేజ్‌ చూశారా? బ్యాండ్‌ బాజాలతో ఫ్యాన్స్‌ రచ్చ, వీడియో వైరల్‌ (2024)
Top Articles
150 Best Air Fryer Recipes
Air Fryer Potato Chips Recipe
Busted Newspaper Pulaski County
Subfinder Online
The Girl Next Door | Rotten Tomatoes
Best Zyn Flavors Ranked
Chris Wragge Illness
Craigslist Southern Oregon Coast
Saydel Botanica
Biz Buzz Inquirer
Fairwinds Shred Fest 2023
Jera Gardens
Apple Store Location
J. Foster Phillips Funeral Home Obituaries
Skyward New Richmond Wi
The Menu Showtimes Near Regal Edwards Ontario Mountain Village
Havasu Lake residents boiling over water quality as EPA assumes oversight
North Colonie Continuing Education
Hyb Urban Dictionary
Nissan Rogue Tire Size
Q102 Snow Desk
6 Fun Things to Do in Bodega Bay - Sonoma County Tourism
Midsommar 123 Movies
Jail Roster Independence Ks
Connection | Scoop.it
Panty Note Manga Online
Tnt Tony Superfantastic
Произношение и транскрипция английских слов онлайн.
Oldgamesshelf
Poskes Parts
Family Leisure Sale
Keci News
Western Lake Erie - Lake Erie and Lake Ontario
Best Places To Eat In Winter Park Fl
Best Boxing Gyms Near Me
Odu Csnbbs
Best Upscale Restaurants In Denver
Strange World Showtimes Near Amc Hoffman Center 22
Solve x^2+2x-24=0 | Microsoft Math Solver
Orylieys
Fedex Express Location Near Me
Kpq News Wenatchee Washington
Burkes Outlet Credit Card Sign In
Cvs Pharmacy Tb Test
Texas Longhorns Soccer Schedule
Fandafia
Used Cars for Sale in Phoenix, AZ (with Photos)
Solar Smash Unblocked Wtf
Exploring The Craigslist Washington DC Marketplace - A Complete Overview
Where Is Katie Standon Now 2021
Sutter Health Candidate Login
El Craigslist
Latest Posts
Article information

Author: Melvina Ondricka

Last Updated:

Views: 6023

Rating: 4.8 / 5 (48 voted)

Reviews: 95% of readers found this page helpful

Author information

Name: Melvina Ondricka

Birthday: 2000-12-23

Address: Suite 382 139 Shaniqua Locks, Paulaborough, UT 90498

Phone: +636383657021

Job: Dynamic Government Specialist

Hobby: Kite flying, Watching movies, Knitting, Model building, Reading, Wood carving, Paintball

Introduction: My name is Melvina Ondricka, I am a helpful, fancy, friendly, innocent, outstanding, courageous, thoughtful person who loves writing and wants to share my knowledge and understanding with you.